Saturday, April 12, 2025

రాష్ట్రంపై గచ్చిబౌలి మచ్చ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:హెచ్‌సి యు భూముల విషయంలో విదార్థులు ప్రదర్శించిన శాంతియుత పోరాట పద్ధతి ని మాజీ సిఎం కెసిఆర్ అభినందించారు. తమకు అధికారం చేతిలో ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడి, ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తే అటు న్యాయస్థానాలు, ఇటు స భ్య సమాజం, విద్యార్థిలోకం తిప్పికొడుతుందని, అందుకు హెచ్‌సియూ ఉదంతాన్ని గుణపాఠంగా తీసుకోవాలని ఆయ న సూచించారు. ఎంతో జాగ్రత్తగా, రా ష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా, అన్ని రంగాల్లో నిలబెడితే దానిని నిలుపుకోవడం చేతగాక, ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక ప్రతిష్టను దిగజార్చారని, అది చాలక, హెచ్‌సి యూ భూముల వంటి దుందుడుకు చర్యలతో దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువు ప్రతిష్టల ను కూడా దిగజార్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తుండడం శోచనీయమని ఆయన అ న్నారు.

తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఏర్పాటయిన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కేవలం తెలంగాణ విద్యార్థులే చదువుకోరని, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలనుంచి వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించడానికి వస్తుంటారని ఆయన తెలిపారు. అంతటి విశ్వఖ్యాతి గడించిన హెచ్‌సియూ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కెసిఆర్ తప్పుబట్టారు. ఈనెల 27 న వరంగల్ జిల్లాలో బిఆర్‌ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి శనివారం ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన అధ్యక్షులు పార్టీ ముఖ్యనేతలతో కెసిఆర్ ఎర్రవెల్లి నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితులు దిగజారుతున్న అంశాలు, వ్యవసాయం, విద్యుత్ సరఫరా,సాగు నీటి సరఫరా, తాగు నీరు సహా మౌలిక వసతుల లభ్యత గురించి ఆరాతీశారు.అన్ని జిల్లాల్లో వారి వారి నియోజక వర్గాల పరిథిలో ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలు నష్టాల గురించి, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో రోజు రోజుకు పెల్లుబికుతున్న వ్యతిరేకత గురించి, ప్రజల మనోవేదనను పార్టీ నేతలు వివరించారు.

ఉద్యమ స్పూర్తి బిఆర్‌ఎస్ పార్టీ సొంతం
అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ రాష్ట్ర బాగోగుల పట్ల బిఆర్‌ఎస్ కార్యకర్తలకు, నాయకులకున్నంత ఆవేదన మరే ఇతర పార్టీకుండదని, ప్రజల సంక్షేమం అభివృద్ధి గురించి అహర్నిశలు కృషి చేసిన ఉద్యమ స్పూర్తి బిఆర్‌ఎస్ పార్టీ సొంతమని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం ఎక్కడబోతేంది, ప్రజలు ఏమైతే వారికేంది తమ స్వార్థ రాజకీయ అధికారమే పరమావధిగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజల పాలిటి శాపంగా మారారని ఆయన మండిపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనదే అధికారమని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News