Monday, December 23, 2024

కెసిఆర్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్: రామ్ గోపాల్ వర్మ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమాలు, రాజకీయాలు అనే తేడా లేకుండా ఏ విషయంలోనైనా తనదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. తాజాగా టిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రశంసించే విధంగా వర్మ ఓ ట్వీట్ చేశారు. కెసిఆర్ తర్వలోనే జాతీయ స్థాయిలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీకి భారతీయ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పేరును పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే స్పందించిన వర్మ సినిమా నటుల్లా కాకుండా కెసిఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అని ట్వీట్ చేశారు.

“బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 అడుగు జాడలను అనుసరించి.. టిఆర్‌ఎస్ కూడా బిఆర్‌ఎస్‌గా పాన్ ఇండియాగా వెళ్తుంది. రీల్ ఫిల్మ్ స్టార్స్ యాష్, తారక్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాగా కాకుండా కెసిఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్‌” అని వర్మ పేర్కొన్నారు. శుభకాంక్షలు చెబుతున్నట్టుగా ఓ ఫ్లవర్ ఎమోజీని కూడా ట్వీట్లో ఉంచారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

KCR Real Pan India Political Star: RGV

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News