Monday, December 23, 2024

కోలుకుంటున్న కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ క్రమంగా కోలుకుంటున్నారు. తుంటి శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న కెసిఆర్ ఇప్పుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు గత ఆరువారాలుగా సంబంధిత వ్యాయామం చేస్తూ విశ్రాంతి తీసుకుంటూ శక్తిని పుంజుకుంటున్న ఆయన, వైద్యుల పర్యవేక్షణలో చేతికర్ర సాయంతో నడవడం ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి సాధారణ స్థితిలో నడుస్తారని వైద్యులు తెలిపారు.

వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన చికిత్స తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ త్వరగా కోలుకునే ప్రయత్నం చేస్తున్న కెసిఆర్ తాజాగా ఊతకర్ర సాయంతో నడుస్తున్న వీడియోను బిఆర్‌ఎస్ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేశారు. త్వరలోనే కెసిఆర్ పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి సాధారణ స్థితిలో నడుస్తారని పేర్కొన్నారు. తాజాగా కెసిఆర్ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News