Wednesday, January 22, 2025

తెలంగాణ జర్నలిస్టులతో నాది ఉద్యమ సంబంధం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ జర్నలిస్టులతో తనది ఉద్యమ సంబంధమని, రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తెలంగాణ జర్నలిస్టుల కృషిని గౌరవిస్తు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జర్నలిస్టులకోసం వంద కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. మీడియా అకాడమీ ద్వారా జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటూ వస్తుందన్నారు. అక్రిడేషన్లు సహా జర్నలిస్టులకు అందాల్సిన అన్ని ప్రత్యేక సౌకర్యాలను అందిస్తున్నదని, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా జర్నలిస్టు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందనీ సిఎం కెసిఆర్ తెలిపారు.

భారత రాష్ట్ర సమితి ఏర్పాటు సందర్భంగా అభినందనలు, తమ సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీకి వచ్చిన అల్లం నారాయణ ఇతర జర్నలిస్టు నేతలతో సిఎం కెసిఆర్ రెండోరోజు శుక్రవారం మరోసారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సంధర్భంగా జర్నలిస్టు నేతలు పలు అంశాలను సిఎం దృష్టికి తీసుకెళ్లారు. పలు జర్నలిస్టు సమస్యలపై చర్చించిడంతో పాటు సానుకూలంగా కెసిఆర్ స్పందించారు. ఇంకా ఏవైనా సమస్యలుంటే పరిస్థితులను బట్టి చర్చించి పరిష్కరించుకుందామన్నారు.

తెలంగాణ జర్నలిస్టుల సంఘం (టి యు డబ్ల్యు జె) ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజెయు) జాతీయ సదస్సు కు ముఖ్య అతిథిగా సిఎం కెసిఆర్ ను ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టు విషయాలపై సమన్వయం చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ను సిఎం అదేశించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణతో పాటు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, టియుడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, అవ్వారి భాస్కర్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News