- Advertisement -
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కెసిఆర్ అంతగా బయట కనిపించడం లేదు. పార్టీ కార్యకలాపాలన్ని ఆయన తన ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు. అయితే తాజా కెసిఆర్ సికింద్రాబాద్ పాస్‌పోర్టు ఆఫీస్‌లో కనిపించారు. తన పాస్‌పాస్ట్ గడువు తేదీ ముగియడంతో ఆయన దాన్ని రెన్యువల్ చేయించుకున్నారు.
ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన తెలంగాణ భవన్‌కు వెళ్లారు. దాదాపు 7 నెలల విరామం తర్వాత కెసిఆర్ తెలంగాణ భవన్‌కు వెళ్లడం విశేషం. ఇందుకు కారణం లేకుండా పోలేదు. కొన్నిరోజుల్లో భారాస రజతోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆయన పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతకు దిశానిర్ధేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై, పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను ఆయన పార్టీ నేతలకు బోధించనున్నారు.
- Advertisement -