Tuesday, January 21, 2025

అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ ఏర్పాట్ల‌పై కెసిఆర్ స‌మీక్ష‌

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్ : భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ ఏర్పాట్ల‌పై ముఖ్య‌మంత్రి కెసిఆర్ స‌మీక్షించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారుల‌తో కెసిఆర్ స‌మీక్షించారు. హుస్సేన్ సాగ‌ర్ తీరంలోని ఎన్టీఆర్ గార్డెన్ వ‌ద్ద 125 అడుగుల ఎత్తులో అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాట్లు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి.

ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బిడ్డలను హైదరాబాద్‌కు పిలిపించి.. లక్షలాది మంది మధ్య అంబేడ్కర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించ‌నున్నారు. అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ అనంతరం భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News