Monday, January 20, 2025

నా దెబ్బకు ఆగిపోయిన రైతుబంధు పడింది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నిజామాబాద్‌బ్యూరో : తాను పిడికిలి బిగించి రోడ్డెక్కానుకాబట్టే ఆగిపోయిన రైతుబంధుమొదలైందని,దెబ్బకు దెయ్యం వదిలిందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నా రు. సోమవారం రాత్రి నిజామాబాద్ నగరంలో నెహ్రూ పార్క్ లో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రికి వణు కు పు ట్టింది కాబట్టే రైతుబంధు పడిందని వ్యాఖ్యానించారు. కాలు వి రిగి, కుంటుతున్నా తాను గర్జించాను కాబట్టే ప్రభుత్వం కదిలిందని అ న్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీ కూ డా పూర్తిగా రాలేదని, మహిళలకు రూ.రెండు వేలు ఇచ్చారా అని ప్ర శ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదని, 400 సీట్ల అని ఆ పార్టీ నేతలు గప్పాలు కొడుతున్నారని, కానీ 200సీట్లు మించి వచ్చే పరిస్థితి లేదని  అన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు 14 సీట్లు గెలిపిస్తే ఆగిపోయిన పథకాలన్నింటినీ మొదలు పెట్టిస్తామని భరోసా ఇచ్చారు. పదేళ్ల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చి మోడీ సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ అన్నారని, కానీ దేశం సత్యనాష్ అయిందని దుయ్యబట్టారు.

ఇంటింటికీ రూ.పదిహేను లక్షలు ఇస్తానన్నారని.. ఇచ్చారా ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వరప్రదాయిని గోదావరిని తరలించడానికి కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. మన గోదావరి మనకే ఉండాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలవాలన్నారు. లేకపోతే ఉన్న గోదావరి వట్టిపోతదన్నారు. జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇస్తామని గాలికి వదిలేశారని, పదేళ్ళలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కూడా మోడీ ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. కల్యాణలక్ష్మి స్కీంలో తులం బంగారం ఇస్తామన్నారు.. ఇచ్చారా? మహిళలకు రూ.రెండు వేల పెన్షన్ ఇస్తామన్నారు.. ఇచ్చారా? రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నారా.. బోనస్ బోగస్ అయిందని.. కనీసం వడ్లు కొనే దిక్కులేదని ఎద్దేవా చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఆపివేశారని మండిపడ్డారు. తెలంగాణలో చేనేత, రైతుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయని,

ఐదు నెలలకే ఆగం పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఐదు నెలల క్రితం తెలంగాణ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉందన్నారు. ఐదు నెలలకే తెలంగాణను ఆగం చేశారన్నారు. తమ హయాంలో చేపట్టి అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను నిలిపివేశారని ఆరోపించారు. కరెంటు కోతలు పెడుతున్నారని, మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆగిన పథకాలు మళ్లీ రావాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సభలో పార్టీ ఎంపి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బిగాల గణేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News