Sunday, December 22, 2024

నేడు వరంగల్ కెసిఆర్ రోడ్ షో..

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆదివారం వరంగల్ లో పర్యటించనున్నారు. వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ తరపున కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ వరంగల్ కు చేరుకుంటారు.

అనంతరం జిల్లా నేతలతో కలిసి అదాలత్‌ సెంటర్‌, అంబేద్కర్‌ సెంటర్‌, పెట్రోల్‌ పంపు జంక్షన్‌ మీదుగా హనుమకొండ చౌరస్తా వరకు కెసిఆర్ రోడ్ నిర్వహించనున్నారు. చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. ఇక, సోమవారం కెసిఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News