మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ మానవీయ పాలనకు తార్కాణం ఉమ్మడి రాష్ట్రంలో అరకొర జీతాలతో ఇబ్బందులు పడ్డ ఆశావర్కర్లు, శానిటేషన్, పబ్లిక్ హెల్త్ వర్కర్లు, పారిశుద్ధ కార్మికులకు మరే రాష్ట్రంలో లేనట్టుగా మూడు సార్లు జీతాలు పెం చారని మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఉమ్మడి రా ష్ట్రంలో ఆశావర్కర్లకు గౌరవ వేతనంగా రూ.1800 మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు అది అంచెలంచెలుగా పెంచి రూ.9,750కు టిఆర్‌ఎస్ సర్కార్ చేర్చిందని గుర్తు చేశారు. నిత్యం ప్రజారోగ్య రక్షణ విధులు నిర్వర్తించే ఆ ఉద్యోగులకు ఇది సముచిత గౌరవమన్న ఆ యన అన్ని వర్గాల సంక్షేమం పట్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ‘ముఖ్యమంత్రి కెసిఆర్ మానవీయ పాలనకు తా ర్కాణం 22,533 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్లు, 7,731 మంది పా రిశుద్ధ కార్మికులకు నెలవారీ గౌరవ వేతనాలను 30 శాతం పెం చుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఆ ఉద్యోగులకు ఇది సముచిత గౌరవం!’ అని కెటిఆర్ ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ మానవీయ పాలనకు తార్కాణం : కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -