Monday, December 23, 2024

ముదిరాజ్‌ల సంక్షేమానికి కెసిఆర్ సర్కార్ కృషి

- Advertisement -
- Advertisement -

మరిపెడ: ముదిరాజ్‌ల సంక్షేమానికి సిఎం కెసిఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామంలో గురువారం ఆయన మత్య పారిశ్రామిక సహకార సంఘ భవనాన్ని మహబూబాబాద్ బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎంపి మాలోతు కవిత, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావులతో కలిసి ప్రారంభించారు. చిల్లంచర్ల మత్స పారిశ్రామిక సొసైటీ అధ్యక్షులు, జిల్లా కార్యదర్శి పిట్టల ధనుంజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్సకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. మత్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం చెరువులు, కుంటల్లో వంద శాతం సబ్సిడీ కింద చేప పిల్లలను అందిస్తుందన్నారు. మత్య సంపదతో ఏడాది పొడవునా ఉపాధి దొరుకుతుందని తెలిపారు. మోపెడ్లు, ద్విచక్ర, ఫోర్ వీలర్ వాహనాలు, వలలు, ఐస్ పెట్టెలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్సకారుల కుటుంబాలకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుందన్నారు.

అనేక సంక్షేమ పథకాలతో ఆదుకుంటుందన్నారు. మత్సకారుల సంక్షేమానికి గత ప్రభుత్వాలు బడ్జెట్‌లో పది కోట్లు కేటాయిస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పడు ఆ బడ్జెట్‌ను వంద కోట్లకు పెంచిందన్నారు. గత ప్రభుత్వాల హాయంలో మత్సకారుల సంక్షేమాన్ని విస్మరించారని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముదిరాజ్‌ల కోసం కమ్యూనిటీ భవనాలను ఏర్పాటు చేస్తుందన్నారు. సిఎం కెసిఆర్ వారి సంక్షేమాన్ని కాంక్షించి ఎన్నో పథకాలు తీసుకువచ్చారని తెలిపారు. మత్సకారులకు ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, వైస్ ఎంపిపి గాదె అశోక్‌రెడ్డి,

తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు చిల్లా సహదేవ్ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి పిట్టల ధనుంజయ్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు హనుమంతరావు, కార్యదర్శి శ్రీనివాస్, బొమ్మగట్టి సైదులు, తొర్రూర్ మండల అధ్యక్షులు కొత్తూరు రమేష్, మరిపెడ మండల అధ్యక్షులు బయ్య ఉపేందర్, నర్సింహులపేట మండల అధ్యక్షులు మంద వెంకన్న, ఉగ్గంపల్లి సర్పంచ్ బీసు మల్లేశం, జిల్లా యువత ప్రధాన కార్యదర్శి గంగరబోయిన రమేష్, సిరోలు మండల ప్రధాన కార్యదర్శి పదిర వెంకన్న, మండల ఉపాధ్యక్షులు గోనెల వెంకన్న, కుమ్మరికుంట్ల మత్సశాఖ ఉపాధ్యక్షులు బత్తిని మల్లయ్య, దంతాలపల్లి యువత ఉపాధ్యక్షులు చిల్లా వీరేష్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్ సంఘం నాయకులు, అధికారులు, చిల్లంచర్ల సొసైటీ డైరెక్టర్లు, సోసైటీ సభ్యులు, ముదిరాజ్ బందువులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News