Wednesday, January 22, 2025

కెసిఆర్ సెకండ్ ఇన్నింగ్స్ మీరే చూస్తారు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రజలే చూస్తారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై కెసిఆర్ తో పాటు బిఆర్ఎస్ నిలదీస్తారన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బిఆర్ఎస్ పార్టీ సమాయత్తం అవుతుందని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బేస్ లాంటిందని హరీష్ రావు చెప్పారు.

మంగళవారం బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. మూడు నెలల తరువాత కెసిఆర్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నిక తరువాత తొలిసారిగా ఆయన తెలంగాణ భవన్ కు వచ్చారు. కృష్ణ జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను సమీక్షించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News