Monday, December 23, 2024

కెసిఆర్, కెటిఆర్ లు రాజీనామా చేయాలి: ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్ పిఎస్సి పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ బిజెపి నేతల బృందం గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేసింది. శనివారం ఉదయం రాజ్ భవన్ కు వెళ్లిన బిజెపి నేతలు, టిఎస్ పిఎస్సి చైర్మెన్ తోపాటు సభ్యులను తొలిగించి కొత్త కమిషన్ ను నియమించాలని కోరుతూ గవర్నర్ కు వినతి పత్రం అందజేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో బూర నర్సయ్య గౌడ్, ఈటల రాజేందర్, డికె అరుణ, మర్రి శశిధర్ రెడ్డి, రాంచందర్, విఠల్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఐటి మంత్రి కెటి రామారావులు తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. నాలుగు పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయంటే ప్రభుత్వ పనితనం కనిపిస్తోందని విమర్శించారు.ఇది కావాలని చేశారా?, యాదృచ్చికంగా జరిగిందా అని ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఈ వ్యవహారంలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News