Monday, January 27, 2025

సోదరి సకలమ్మ పార్థివదేహానికి కెసిఆర్ నివాళి

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోదరి చీటి సకలమ్మ (82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం మేడ్చల్ మండలం మునిరాబాద్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న కెసిఆర్.. సోదరి పార్థివదేహానికి నివాళులర్పించారు.

సోదరి చీటి సకలమ్మ కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు. పూడూరులోని స్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. చీటి సకలమ్మ అంతిమయాత్రలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంఎల్‌సి కవిత ఇతర కుటుంబ సభ్యులు పాల్గాన్నారు. కాగా, కెసిఆర్‌కు సకలమ్మ ఐదవ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర. భర్త హన్మంతరావు కొన్నేండ్ల క్రితమే మృతిచెందారు. వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News