Sunday, January 19, 2025

తెలంగాణలో మళ్లీ పాత రోజులొచ్చాయి: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పాత రోజులు కనిపిస్తున్నాయని మాజీ సీఎం కెసిఆర్ అన్నారు. నీళ్లు, కరెంట్ లేక లక్షల ఎకరాల పంటలు ఎండిపోయానని ఆయన చెప్పారు. ఆదివారం జనగామ, సూర్యపేట జిల్లాలో కెసిఆర్ పర్యటించి.. పలు ప్రాంతాల్లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు.

పంటలను పరిశీలించి, రైతుల ఆవేదన విన్న అనంతరం కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. “రూ.35వేల కోట్లతో విద్యుత్ పాలసీ తీసుకొచ్చాం. 7వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని 18వేల మెగావాట్లకు పెంచాం. హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ సిటీగా తీర్చిదిద్దాం.8ఏళ్లు రెప్పపాటు కరెంట్ పోకుండా సరఫరా చేశాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ పోతే వార్త.. ఇప్పుడు కరెంట్ ఉంటే వార్త. 5600 మెగావాట్ల పవర్ ను ఉత్పత్తి చేసుకునే సౌకర్యం కల్పించాం. ఉన్న కరెంట్ వాడుకునే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు. తెలంగాణలో మళ్లీ జనరేటర్లు, ఇన్వెటర్లు, కన్వెర్టర్లు కనిపిస్తున్నాయి. పవర్ ఫెయిలూర్స్ కు ఎవరు కారణం. 100 రోజుల్లో ఇంత అస్తవ్యస్తం ఎందుకు?. కాంగ్రెస్ పాలకుల వల్లే ఈ దుస్థితి వచ్చింది” అని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News