Monday, December 23, 2024

నీటి నిర్వహణలో ఘోర వైఫల్యం

- Advertisement -
- Advertisement -

15లక్షల ఎకరాలను ఎండబెట్టారు
209 మంది రైతులు ఉసురు
తీశారు జలధారలను ఎడారులుగా
మార్చారు చవటలు, దద్దమ్మలు,
అసమర్థ్ధులు పొలంబాటలో
ప్రభుత్వంపై నిప్పులు కురిపించిన
బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్/సిరిసిల్ల : ఈ ప్రభుత్వానికి నీటి నిర్వహణ సామర్థ్యం లేదు, తెలియదని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.నీటి న్విహణలో రాష్ట్ర ప్రభు త్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. కరీంనగర్ జిల్లాలో గత పదేళ్లలో తాము సజీవ జలధారలు సృష్టించామని, గత ఏడేళ్లు చెక్‌డ్యామ్‌లు నిరంతరం నీళ్లతో కళకళలాడేవని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా పొలం బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కెసిఆర్ ఎం డిన పంటలను పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్నదాతలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా కెసిఆర్ భరోసానిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా సిరిసిల్ల బిఆర్‌ఎస్ పార్టీ కా ర్యాలయంలో నిర్వహించిన మీ డియా సమావేశం లో కెసిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నిండు జలాలతో కళకళలాడిన రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితులు వ చ్చాయని..? ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం తె లి వి తక్కువ, అసమర్థ, అవివేక, చవట విధానాలవ ల్ల, అర్బకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వ చ్చిందని ధ్వజమెత్తారు. 2014కు ముందు తెలంగాణలో ఏ గోస ఏ ఏడుపు ఏ బాధ, ఏ మం చి నీళ్ల ట్యాంకర్లు, ఏ బిందల కోట్లాటలు, ఏ కాలిపోయిన మోటర్లు కనబడుతుండెనో ఇప్పుడు అదే పరిస్థితి కనబడుతున్నదని మండిపడ్డారు.

ఇది కా లం తెచ్చిన కరవు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరవు అంటూ దుయ్యబట్టారు. మోసపూరితమైన హామీ లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాకతీయ కాలువలో ఏడాదిలో 10 నెలలు నీళ్లు ఉండేవని తె లిపారు. గోదావరి నది 200 కిమీ మేర సజీవ జలధార కనిపించేదని, గత ఎనిమిదేళ్లు ప్రజలు ఆ ఫలాలను అనుభవించారని పేర్కొన్నారు. ఇప్పుడు 4 నెలల్లోనే ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని కెసిఆర్ తెలిపారు. ఈ ప్రభుత్వానికి నీటి నిర్వహణ సామర్థ్యం లేదు, తెలియదని విమర్శించారు. ప్రభుత్వ వైఫ ల్యం వల్లనే ఇవాళ పం టలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. లోటు వర్షపాతం వల్ల పం టలు ఎండిపోయాయ ని మంత్రులు చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం డిజైన్ల వి షయంలో కాంగ్రెస్ వాళ్లకు తెలివి లేదని అన్నారు. మేడిగడ్డ వద్ద మూడు పిల్లర్లు కూలిపోతే మొత్తం మునిగిపోయినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల గంగానదిలో బ్రిడ్జి కడుతుంటే కూలి పోయిందని, ఇలాంటివి జరుతూనే ఉంటాయని చెప్పారు. ఓ చిల్లర కుట్ర మనసులో పెట్టుకుని వృధాగా పారేనీళ్లను వదిలిపెట్టారని ధ్వజమెత్తారు. ఈ దద్ధన్నలకు చాతగాకపోతే 50 వేల రైతుల వెంటపెట్టుకుని వీళ్లను పండబెట్టి తొక్కుకుంటా పోయి మేడిగడ్డ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని నీళ్లను నింపుతా రంది పడకండి అని రైతులకు భరోసా ఇచ్చారు.

సిఎం అడిగిన 24 గంటల్లోనే సిఎస్‌కు వివరాలు ఇచ్చాం
గతేడాది లోటు వర్షపాతం అనేది వాస్తవం కాదు, గతేడాది వర్షాలు ఎక్కువగా పడ్డాయని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఆత్మహత్య చేసుకున్న 209 మంది రైతుల వివరాలను సిఎస్‌కు పంపించామని వివరించారు. సిఎం అడిగిన 4 గంటల్లోనే రైతుల వివరాలను సిఎస్‌కు పం పించామని స్పష్టం చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలకు ప్రభు త్వం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల కుటుంబాలను ఆదుకోకపోతే ఈ ప్రభుత్వానికి ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. పదేళ్ల క్రితం చేనేత కార్మికుల పరిస్థితి ఎలా ఉందో.. ఇప్పుడు అలా తయారయ్యిందని పేర్కొన్నారు. చేనేత కార్మికులను ఆదుకోకపోతే రాష్ట్రం రణరంగంగా మారుతుందని హెచ్చరించారు.

నేత కార్మికులను నీచంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని 4 నెలలు మాట్లాడలేదని అన్నారు. రైతులకు న్యాయం చేయకపోతే ఇకపై ఊరుకునేది లేదు, ప్రభుత్వం వెంటపడతామని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లాకు తాను వెళ్లిన తర్వాత నీళ్లు వదిలారని ఎద్దేవా చేశారు. రైతుబంధుపై ఈ ప్రభుత్వానికి ఒక దిశ దశ లేదన్నారు. కెసిఆర్ ఎల్లిండు..ఇక ఆగడు అని, ఎక్కడ రైతులకు కష్టం వస్తే అక్కడ గద్ద లెక్క వాలుతా…సమస్యలు పరిష్కారమయ్యే విధంగా సర్కార్ మెడలు వంచి హామీలు అమయ్యేలా చేస్తానని చెప్పారు.
ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి :

తెలంగాణ వ్యవసాయం అంతా సంక్షోభానికి గురైందని, రుణమాఫీ గురించి బ్యాంకర్లతో ఎందుకు మాట్లాడటం లేదని మాజీ సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. అన్ని పంటలకు ఇస్తామన్న బోనస్ ఏమైంది, యాదవులకు గొర్రెల యూనిట్లను ఎందుకు ఇవ్వట్లేదన్నారు. దళిత బంధు కోసం అన్ని గ్రామాల్లో ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. అన్న వస్త్రం కోసం పోతే, ఉన్న వస్త్రం ఊడినట్లుగా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News