Sunday, September 8, 2024

ఆరు నెలల్లోనే అంతా ఆగమాగం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/నర్సాపూర్ : అరచేతిలో వైకుంఠం చూపించి.. మ నల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కెసిఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన త ర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. రైతులను, యువకులను.. అందర్నీ కాంగ్రెస్ పార్టీ వంచించిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హా మీలు ఇచ్చిందని.. ఒక్క ఉచిత బస్సు మినహా ఏది కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. గత 15 రోజులుగా కొనసాగుతున్న కెసిఆర్ బస్సు యాత్ర బుధవారం నాడు మెదక్ పార్లమెంటు పరిధిలోని నర్సాపూర్ చేరుకుంది. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. ఐదు నెలల్లోనే రాష్ట్రం ఇంత ఆగమాగం ఎందుకయ్యిందని ప్రశ్నించారు.

రైతుబంధు కూడా రేపు రేపు వ్యవసాయం చేసినోళ్లకే ఇస్తారంట.. పొలం దున్నినోళ్లకే ఇస్తారంట అని పేర్కొన్నారు. ఇంతకుముందు అట్ల వచ్చిందా..? ఇంతకుముందు అందరికి వచ్చింది కదా..? అని ప్రశ్నించారు. రైతుబంధు నాట్లు వేసేటప్పుడు ఇయ్యాలి.. కానీ కోతలు అయినయ్.. కల్లాలు అయినయ్ ఇప్పుడు రైతుబంధు వేస్తామని అంటారు.. ఇంతకంటే జోక్ ఏమైనా ఉంటదా..? అని అడిగారు. తల, తోక లేకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణను నష్టపరుస్తుందని మండిపడ్డారు. కరెంటు కోతల కారణంగా హైదరాబాద్‌లో పరిశ్రమలు వెళ్లిపోయే పరిస్థితులు, ఐటీ రంగం దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
మంచినీళ్ల కోసం కోమటిబండ నుంచి నర్సాపూర్‌కు ప్రత్యేక లైన్ వేయించానని కెసిఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నర్సాపూర్ లింక్ కావాలని.. శంకరంపేట నుంచి కాల్వలు తవ్వుతున్నారు.. మల్లన్నసాగర్ నుంచి ఒక్కసారి నీళ్లు రావడం మొదలైతే.. నర్సాపూర్ బంగారు తునక అవుతుందని పేర్కొన్నారు. దాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తదనే నమ్మకం లేదు అని, ఆ కాల్వ పూర్తి కావాలి.. మల్లన్న సాగర్ నుంచి బ్రహ్మాండంగా నీళ్లు రావాలంటే ఎంపిగా వెంకట్రామిరెడ్డి గెలవాలని కెసిఆర్ తెలిపారు. మనందరం కలిసి యుద్ధం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చేలా లేదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, ఇంకా నెరవేరుస్తదనే ఆశ లేదని విమర్శించారు. నర్సాపూర్‌ను కెసిఆర్ ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసిండో మీ అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. నర్సాపూర్ మున్సిపాలిటీకి 25 కోట్లు ఇచ్చినా అని పేర్కొన్నారు. ఆ నిధులను కూడా వాపస్ తీసుకెళ్తున్నారని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి డబ్బులు ఇచ్చినం.. వాటిని కూడా వాపస్ తీసుకెళ్తున్నారని చెప్పారు. కొల్చారం మండలంలో మల్లినాథ సూరి పేరు మీద యూనివర్సిటీని పెడదామని అనుకున్నాం.. దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసేలా లేదని వ్యాఖ్యానించారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హల్దీవాగు మీద, మంజీరా నది మీద 10 చెక్‌డ్యామ్‌లు కట్టాం.. దాని ద్వారా పంటలు పండించుకున్నాం.. దాన్నంతా దెబ్బ తీసే పరిస్థితులు వస్తున్నాయని పేర్కొన్నారు. అంటే సాగు నీరు రాదు.. తాగునీరు రావు.. కరెంటు రాదు.. సంక్షేమం లేదు అని.. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రతి దానికి ఏదో కొండి పెట్టడం, తొండి పెట్టడం, అబద్ధాలు చెప్పడం చేస్తుందని కెసిఆర్ మండిపడ్డారు. నరేంద్ర మోడీ 150 నినాదాలు ఇచ్చారని, అందులో ఒక్కటి అమలు కాలేదని కెసిఆర్ విమర్శించారు. మోడీ ఎజెండాలో పేదలు ఉండరని పేర్కొన్నారు. ఢిల్లీలో 750 మంది రైతులను సంపినోడు మోడీ మండిపడ్డారు. మేధావులు,యువత, ఆలోచనపరులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కృష్ణా నీళ్లు రావాలన్నా తెలంగాణ ఆత్మగౌరవం గెలవాలన్నా బిఆర్‌ఎస్ ఎంపీలు గెలవాలని అననారు. తెలంగాణలో మొత్తం ఎంపిల కన్నా ఎక్కువ మెజార్టీతో వెంకట్రామిరెడ్డి గెలువబోతున్నట్లు తనకు రిపోర్టు ఉన్నదని చెప్పారు. అందరూ ఓటేసి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News