- Advertisement -
కేవలం 100 రోజుల్లో ఇంత దర్భరమైన పాలనను చూడలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కెసిఆర్ మండిపడ్డారు. ఆదివారం జనగామ, సూర్యపేట జిల్లాలో కెసిఆర్ పర్యటించి.. పలు ప్రాంతాల్లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు.
అనంతరం కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. విచ్చలవిడిగా మంచినీటి వ్యాపారం జరుగుతోందన్నారు. ప్రజలందరికీ మంచినీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో మేం పనిచేశామని.. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు మళ్లీ బిందెలతో రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో ఒక్క వాటర్ ట్యాంక్ కూడా కనిపించలేదన్నారు. అవివేకం, అసమర్థత వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కెసిఆర్ విమర్శించారు.
- Advertisement -