Monday, December 23, 2024

విద్యపై కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు: సబితా ఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

 

Sabitha indra reddy comments on medical seats

హైదరాబాద్: ఎడ్యుకేషన్ పెయిర్ లాంటి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని విద్యాశాఖ మంత్రి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. నిజాంకాలేజీలో ఎడ్యుకేషన్ పెయిర్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మంచి కాలేజీలు ఎంచుకోవడానికి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిఎం కెసిఆర్ వ్యవసాయం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఇంజినీరింగ్ కాలేజీలు విద్యార్థులకు మంచి విద్య అందించడంతో పాటు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. పిల్లలకు ఇష్టం ఉన్న కోర్సుల్లో చేర్చాలని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థులకు అనుమానాలంటే ఉన్నత విద్యామండలి హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉన్నత విద్యామండలిలో హెల్ప్ లైన్ 7660009768, 7660009769 నెంబర్లకు కాల్ చేయాలని సబితా సూచించారు. గత రెండేళ్లుగా ఇంటర్ బోర్డు ద్వారా ఎంసెట్ కోచింగ్ ఇప్పిస్తామన్నారు. సిఎం కెసిఆర్ అతి త్వరలో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రైవేట్ సెక్టార్ లో తెలంగాణలో ఉన్న అవకాశాలు మరే రాష్ట్రంలో లేవన్నారు. పెట్టుబడుల కోసం మంత్రి కెటిఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News