Saturday, November 2, 2024

పిడికెడు ఉప్పుతో గాంధీ సింహంలా గర్జించారు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

KCR speech about Azadi ka amrut mahotsav

హైదరాబాద్: మన స్వాతంత్య్ర పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొనియాడారు. పబ్లిక్ గార్డెన్స్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో కెసిఆర్ జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. తెలంగాణలో 75 వారాల పాటు అమృత్ మహోత్సవ్ వేడకలు నిర్వహిస్తున్న సందర్భంగా కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. అమృత్ మహోత్సవ్ వేడుకల కోసం రూ.25 కోట్లు కేటాయించామని, తెలంగాణలో రెండు చోట్ల ఉత్సవాలు ప్రారంభిస్తున్నామని, వరంగల్ పట్టణంలో కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమాలను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రారంభించారు. గాంధీ వచ్చిన తరువాత స్వాతంత్య్ర ఉద్యమం ఉధృతంగా సాగిందన్నారు.

మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వారికి మహాత్మాగాంధీ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. బ్రిటీష్ వారు తెచ్చిన ఉప్పు చట్టం దేశ ప్రజలకు ప్రమాదకరంగా మారిందని, 1930 మార్చి 12న గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారని, ఉప్పు చట్టానికి వ్యతిరేకంగా దండి వరకు గాంధీ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ఉప్పు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని గాంధీ డిమాండ్ చేశారని, దండి యాత్రలో ప్రజలు వేలాదిగా పాల్గొన్నారని, దండియాత్ర స్వాతంత్య్ర సంగ్రామంలో అద్భుత ఘట్టమని కితాభిచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను నేటి తరానికి తెలియజెప్పాలని సూచించారు. గాంధీ చేపట్టిన దండియాత్రలో హైదరాబాద్ ముద్దు బిడ్డ సరోజిని నాయుడు పాల్గొన్నారని, అరేబియా సముద్రం తీరాన పిడికెడు ఉప్పును చేతబట్టి మహాత్మా గాంధీ సింహంలా గర్జించారని పొగిడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News