తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్సేనని కెసిఆర్ విమర్శించారు. బుధవారం బోధన్ లో జరిగిన బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు.
“ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.. ప్రజలు గెలిస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ ప్రజల కోసమే బిఆర్ఎస్ కృషి చేస్తోంది. 1699లో 400మంది ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపింది. వందల మందిని పొట్టనపెట్టుకుని రాష్ట్రాన్ని ఇచ్చింది.ఉమ్మడి రాష్ట్రంలో నిజాంసాగర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెట్టింది. నిజాంసాగర్ ను ఏడాది మొత్తం నిండుగా ఉంచే బాధ్యత బిఆర్ఎస్ ప్రభుత్వానిది. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని బిఆర్ఎస్ శ్రమించింది. వ్యవసాయ స్థిరీకరణ కోసం సాగునీటి పన్ను రద్దు చేశాం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుణగణాలను ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి. విచక్షణతో ఓటు వేసి సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి” అని చెప్పారు.
కాంగ్రెస్సే తెలంగాణకు ప్రధాన శత్రువు: కెసిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -