Monday, December 23, 2024

ఇందిరమ్మ రాజ్యామా?.. తోకమట్టనా?: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్సేనని… బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రలో కలిపి ఇబ్బంది పెట్టారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఇవ్వకుండా టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ చీల్పే కుట్ర చేసిందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొల్లాపూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎ కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు.

“కాంగ్రెస్‌ నేతలు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారు. కాంగ్రెస్‌ తెచ్చేది ఇందిరమ్మ రాజ్యామా?..తోకమట్టనా?. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలిచావులు తప్ప.. ఇంకేమీ ఉండలేదు. మహబూబ్ నగర్ జిల్లాలో ఒకప్పుడు గంజి కేంద్రాలు నడిపారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2కే కిలో బియ్యం ఇచ్చారు. ఆనాడు తెలంగాణ సస్యశ్యామలంగా ఉండి ఉంటే రూ.2కు బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది.50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలి.

బీఆర్‌ఎస్‌ ప్రజల కోసం పుట్టిన పార్టీ. అభ్యర్థుల గుణగణాలతోపాటు వారి వెనుకున్న పార్టీల చరిత్ర కూడా చూడాలి. ఏ పార్టీ ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ వస్తే.. మళ్లీ అవే ఆకలి చావులు, కరెంటు కష్టాలు, రైతుల ఆత్మహత్యలు ఉంటాయి. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ ను గెలిచిపించాలి” అని కేసీఆర్ ప్రజలను అభ్యర్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News