Monday, November 18, 2024

కౌలుదారుల చట్టం వస్తే.. రైతులు ఆగమాగం: కేసీఆర్

- Advertisement -
- Advertisement -

కౌలుదారుల చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ అంటోందనీ, ఆ చట్టం వస్తే రైతుల భూమి గోల్ మాల్ అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. రైతులు తమ భూమికోసం కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తుందన్నారు. రైతుబంధు కౌలుదారులకే ఇస్తామని కాంగ్రెస్ చెబుతోందన్నారు. జగిత్యాలలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు.

‘మూడేళ్లు కష్టపడి ధరణిని తీసుకువచ్చాం. దీనిని తీసేసి భూమాత పోర్టల్ ని తీసుకువస్తామని కాంగ్రెస్ చెబుతోంది. వారు తెచ్చేది భూమాత కాదు, భూమేత. ధరణి పోర్టల్ ని తీసేస్తే రైతుబంధు ఎలా వస్తుంది? ఈ విషయాన్ని రైతన్నలు ఆలోచించాలి’ అని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణాలో రైతు రాజ్యం ఉందనీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉరి పడుతుందని ఆయన అన్నారు.

మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రజలు ఆగమాగం అవుతారని కేసీఆర్ హెచ్చరించారు. ‘ఇందిరమ్మ రాజ్యంలో పరిస్థితులు ఘోరంగా ఉండేవి. ఏ ఒక్కరూ బాగుపడిన దాఖలాలు లేవు. అత్యవసర పరిస్థితి వచ్చింది ఇందిరమ్మ రాజ్యంలోనే కదా. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యమే తెస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నార’ని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News