Tuesday, January 21, 2025

తెలంగాణను అన్ని రకాలుగా గోసపెట్టింది కాంగ్రెస్సే: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్.. తెలంగాణను అన్ని రకాలుగా గోసపెట్టిందని బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ విమర్శించారు. తెలంగాన ఉద్యమ సమయంలో అతిపెద్ద బహిరంగ సభ వరంగల్ లో నిర్వహించామని.. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసమే బీఆర్ఎస్ పుట్టిందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వరంగల్ లో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణతి ఇంకా రాలేదన్నారు కేసీఆర్. కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామంటున్నారని.. ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టారని ప్రశ్నించారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమం ఉంటుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదన్నారు. రాష్ట్రంలో 3కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి 80లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని తెలిపారు. 10ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 50ఏళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకుని ఓటు వేయాలని కేసీఆర్ ప్రజలను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News