Wednesday, January 22, 2025

ఓటు.. మన భవిష్యత్ ను తీర్చిదిద్దే బ్రహ్మాస్తం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరగాలని సిఎం కెసిఆర్ అన్నారు. కోదాడలో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని.. ఏం చేశారు, భవిష్యత్‌లో ఏం చేస్తారు అని ఆలోచించాలన్నారు. ఓటు మన భవిష్యత్ ను తీర్చిదిద్దే బ్రహ్మాస్తమని… పంట పొలాలు ఎండాలా, పండాలా అనేది ఓటు నిర్ణయిస్తుందని చెప్పారు. తెలంగాణ రాక ముందు సాగర్‌ నీళ్ల కోసం రైతులు తన దగ్గరకు వచ్చారని.. 24 గంటల్లో రైతులకు నీళ్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి వార్నింగ్‌ ఇచ్చానని చెప్పారు.

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు పేరుకు తెలంగాణ.. ప్రభుత్వం పెట్టుకున్న పేరు నందికొడ ప్రాజెక్టు అని… ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును గోల్‌మాల్‌ చేసి దిగువన కట్టారన్నారు. తాను మాట్లాడేంత వరకు మన రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కుల గురించి ఎవరూ మాట్లాడలేదని తెలిపారు. పంటపొలాలకు సంపూర్ణంగా నీరు అందించే బాధ్యత తనదని.. బీసీల చైతన్యం చూపించాల్సిన బాధ్యత కోదాడ ప్రజలపై ఉందని కెసిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News