Thursday, January 23, 2025

కాంగ్రెస్ మోసం చేస్తే.. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించా: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఒక దశలో మోసం చేసిందని.. ప్రాణాలకు తెగించి నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించానరి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఎన్నికల ప్రాచారంలో భాగంగా శుక్రవారం మహబూబాబాద్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ వచ్చినందుకే మహబూబాబాద్ ప్రత్యేక జిల్లా అయ్యింది. తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఉద్యమం ప్రారంభించాను. పిడికెడు మందితో ఉద్యమం ప్రారంభించాను. నేను తెలంగాణ సాధిస్తానంటే కొందరు నమ్మలేదు.ఓ దశలో కాంగ్రెస్ మోసం చేసినా.. ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ సాధించా.

రైతుబంధు కింద ఇచ్చే సొమ్ము వృథా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు వద్దనే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి. దేశ ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గురజరాత్ లో కూడా 24 గంటలు కరెంట్ లేదు. కాంగ్రెస్ పాలనలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడేవారు. రైతుబంధు సొమ్ముతో రైతులకు పెట్టుబడి కష్టం తీరింది. ధరణి పోర్టల్ వల్ల భూకబ్జాలు తగ్గిపోయాయి. రైతుల భూమి మీద రైతుకు మాత్రమే అధికారం ఉండాలని ధరణి తెచ్చాం. ధరణి పోతే రైతుబంధు, రైతు బీమా ఉండదు.

బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే..93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తాం.. అలాగే కేసీఆర్ బీమా అమలు చేస్తాం. కేంద్రం పెంచిన గ్యాస్ ధర భారం భరించి.. రూ.400కే లిసిండర్ ఇస్తాం అని సిఎం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News