Sunday, January 19, 2025

జానారెడ్డి గులాబి కండువా కప్పుకుంటానని మాట తప్పిండు: కేసీఆర్

- Advertisement -
- Advertisement -

జానారెడ్డి సిఎం అవుతానని కలలు కంటుండని బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు.రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తే.. జానారెడ్డి గులాబి కండువా కప్పుకుంటానని సవాల్ విసిరాడని.. మనం సవాల్ స్వీకరించి 24 గంటల కరెంటు ఇస్తున్నామని..కానీ, జానారెడ్డి గులాబి కండువా కప్పుకోకుండా మాట తప్పిండని కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు.

“ఎన్నికలు వస్తే ఆగం ఆగం కావొద్దు.. అన్నీ పార్టీల గురించి ప్రజలు తెలుసుకోవాలి. వ్యక్తి గెలవడం ముఖ్యం కాదు.. ప్రజలు గెలవాలి. 50ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిండ్రు.. ప్రజలను ఆదుకోవాలని ఏనాడు ఆలోచించలేదు. 50ఏండ్ల కాంగ్రెస్ పాలన..10ఏళ్ల బీఆర్ఎస్ పాలనను చూసి ఓటు వేయాలి. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. కాంగ్రెస్ గెలిస్తే.. మళ్లీ రాష్ట్రంలో కరెంటు కష్టాలు వస్తాయి. మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తుండు. మూడు గంటలు ఇచ్చే కాంగ్రెస్ కావాలో.. 24 గంటలు కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలో ఆలోచించుకోండి. కాంగ్రెస్ వస్తే.. ధరణిని తీసేస్తామని చెబుతున్నరు.. ధరణి రద్దు చేస్తే రైతుబంధు ఎట్లా వస్తది. కాంగ్రెస్ కు ఓటు వేసి ఆగం కావొద్దు.. మరోసారి బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించండి.. రాష్ట్ర్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News