Monday, December 23, 2024

కోదాడలో రూ.10కోట్లతో బీసీ భవన్ నిర్మిస్తాం

- Advertisement -
- Advertisement -

కోదాడలో రూ.10కోట్లతో బీసీ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. కోదాడలో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. గతంలో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశానని.. కాలవలకు నీరు రాక ప్రజలు ఇబ్బంది పడేవారని.. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అన్నారు. కోదాడకు కాళేశ్వరం నీళ్లు రాలేదని కాంగ్రెస్ నేత భట్టీ విక్రమార్క చెబుతున్నారని.. కాని, మూడేళ్ల నుంచి కోదాడకు నీళ్లు వస్తున్నాయని కెసిఆర్ చెప్పారు.

బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో కర్వ్యూ, కరువు రాలేదన్నారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 5 గంటల కరెంట్ ఇస్తోందని చెప్పారు. రైతుబంధు వృథా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని, కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామని భట్టీ విక్రమార్క చెబుతున్నారని.. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతు బీమా ఎలా వస్తుందని.. ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లోకి ఎలా వస్తాయని ప్రశ్నించారు.బిఆర్ఎస్ మరోసారి గెలిపిస్తే రైతుబంధును రూ.16వేల వరకు పెంచుతామని కెసిఆర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News