Monday, January 20, 2025

గెలిస్తే.. మధిరలో దళితులందరికీ దళితబంధు: కేసీఆర్

- Advertisement -
- Advertisement -

ప్రజలపై ప్రేమతో కాదు.. ప్రత్యేక పరిస్థితుల్లోనే తెలంగాణ ఇచ్చారని బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. మధిర నియెజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. భట్టి విక్రమార్కకు ఓటు వేస్తే నష్టమే జరుగుతుంది తప్ప.. మేలు జరగదన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మధిర నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “పదేళ్లుగా నోరు కట్టుకుని ప్రభుత్వం పనిచేస్తోంది.. భట్టి గెలిచేది లేదు, సీఎం అయ్యేది లేదు.. కాంగ్రెస్ పార్టీ మాకు విరోధి.. అయినా మధిరలో అభివృద్ధి చేశాం.. ఖమ్మం జిల్లాలో గతంలో కంటే రెండు సీట్లు పెరుగుతాయి.. ఇందిరమ్మ రాజ్యంలో ఎవ్వరికీ ఒరిగేది లేదు. బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే.. మధిరలో దళితులందరికీ దళితబంధు ఇస్తాం. కాంగ్రెస్ హయాంలో మధిరలో కరెంటు ఉండేదా?.. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కష్టాలు వస్తాయి” అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News