Thursday, January 23, 2025

ఆరు నూరైనా.. అధికారం మనదే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ‘ఆరు నూరైనా అధికారంలోకి వచ్చేది మనమే. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఎవరి తలలో జేజమ్మ తరం కాదు’ అని బిఆర్‌ఎస్ అధినేత సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ దళారీల రాజ్యం, పైరవీకారులదే పెత్తనం అవుతుందని, కళ్ళ ముందు ఉన్న అభివృద్ధిని చూసి ప్రజలు తమ ఓటు హక్కును విజ్ణతతో ఆలోచించి వినియోగించుకోవాలని కెసిఆర్ ప్రజలకు విజ్ణప్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం మధ్యాహ్నం సత్తుపల్లి సెగ్మెంట్ పరిధిలోని కల్లూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్ల్లందు పట్టణం లో జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎద్దు, ఎవుసం తెలియని రాహుల్‌గాంధీ ధరణి గురించి మాట్లాడుతున్నారని ధరణిని రద్దు చేసిదానికి ప్రత్యామ్నయంగా మళ్ళీ విఆర్‌వో, పహణి నకళ్ళు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల వ్యవస్థను తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రంలో బ్రోకర్ల, పైరవీకారుల పెత్తనాన్ని లంచాల బాగోతాన్ని తీసుకరాబోతున్నారని ఆయన అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా విఆర్‌వో, ఆర్.ఎం ఆర్‌వో, ఆర్డీవో,

జాయింట్ కలెక్టర్ చివరికి కలెక్టర్ పెత్తనాన్ని తీసి వేసి రైతులకే పూర్తి హక్కులను కల్పించామని రెవెన్యూ వ్యవస్ధలో ఎవరికి కోపం వచ్చిన రైతు భూములు కోర్టు వివాదాల్లోకి నెట్టి కోర్టుల చుట్టూ ఏళ్ళ తరబడి తిప్పించేవారని, ఇప్పుడు ధరణి వల్ల రైతులంతా నిశ్చితంగా ఉన్నారని, రైతుల బొటన వేలి ముద్ర వేస్తనే తారుమారు అయ్యేవిధంగా, సాక్షా తూ ముఖ్యమంత్రికి కూడా అధికారం లేకుండా ధరణి వ్యవస్ధను తీసుకొచ్చి రెవెన్యూ పెత్తనాన్ని రద్దుచేస్తే ఇప్పుడు దానిని రద్దు చేస్తారంటున్నారని అంటూ ధరణిని రద్దు చేయాలా? ఉంచాలా? అంటూ సభకు వచ్చిన ప్రజలను ముఖ్యమంత్రి కోరగా జనం అంతా ధరణి ఉండాలని కేకలు వేశారు. ఎవరో అజ్ణాన్ని సన్నాసి రాసిఇచ్చిన స్క్రిప్టు రాసి ఇస్తే చదవడం తప్ప ధరణి గురించి వాళ్ళకు ఏమి తెలుసన్నారు. ధరణి వల్లనే రైతు బంధు సాయంగాని, లేదా ధాన్యం విక్రయించిన సొ మ్ముగాని ఠంచన్‌గా రైతుల ఖాతాలో పడుతున్నాయన్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే దళారుల రాజ్యం వస్తుందని,

మ ళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అదే బిఆర్‌ఎస్‌కు మళ్ళీ అవకాశం ఇస్తే మీ భూముల మీద మీకే పెత్తనం ఉంటుందన్నారు. కాంగ్రెస్ నేతల్లో ఒకరు రైతు బంధు దుబారా అని, మరోనేత కరెంట్ మూడు గంటలు చా లు అంటున్నారని, ఇంకొక్కరూ ధరణి వద్దు అంటున్నారని భుజం మీద గొడ్డలిని పెట్టి బట్ట కప్పారని మీరంతా (ప్రజలు) ఓట్లు వేస్తే వాళ్ళు ఒక వేటు వేసి వీటన్నింటిని బంద్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కెసిఆర్ అన్నారు
దళితబంధు పదాన్ని పుట్టించిన మెనగాడు కెసిఆర్
ఈ దేశంలో దళితబంధు అనే పదంను పుట్టించిన మెగాడు ఎవ్వరంటే అది కెసిఆరే అని, దళిత బంధు కావాలని తనను ఎవ్వరూ అడగలేదని, ఎవ్వరూ కూడా ధర్నాలు చేయలేదని, ఎవ్వరూ దరఖాస్తులు ఇవ్వలేదని కాని ఎందుకు ఈ పథకా న్ని పెట్టాం కేవలం ఓట్ల కోసం పెట్టలేదని సిఎం స్పష్టం చేశా రు. ఈ పథకాన్ని పెట్టినప్పుడు ఎన్నికలు లేవన్నారు. ఈ పథ కం పెట్టడానికి తాను సిద్దిపెట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపట్టిన దళిత చైత న్య కార్యక్రమాల స్పూర్తితోనే దళిత బంధు పుట్టుకోచ్చిందన్నారు. స్వా తంత్య్రం సిద్ధ్దించి 75 సంవత్సరాలు దాటినప్పటికీ యుగాలు, తరాలు మా రినప్పటికి దళితుల స్థితిగతులో మా ర్పులు రాలేదని, ఇంకా వారిపై అణిచివేత, అంటరానితనం, వివక్ష వెలివాడలు కొనసాగుతున్నాయని, జాషువా వంటి మహాకవి దళితుల స్ధితిగతుల ను చూసి బాధపడి కావ్యాలు రాశారని సాటి మానవులుగా వారి గురించి మూడు రంగుల జెండాలుగాని, ఎరు పు, పసుపు రంగుల జెండాల వాళ్ళు గాని ఏమి పట్టించుకోలేదని అరచెతిలో బెల్లం ముక్క పెట్టి చాక్లెట్లు, చెక్కె ర గోలీలు పంచి దశబ్ధాల తరబడి దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బిఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన వా టికంటే చెప్పని వాటిని పది రెట్లు అమలు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీసుకొచ్చిన వాళ్ళం కాబట్టి బాధ్యతాయుతంగా దళితులను బాగు చేయాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చామని సిఎం స్పష్టం చేశారు. తెలంగాణ ఆదాయం మెరుగుపడ్డాక అధికారంలోకి వచ్చిన రెండో ఏటా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. కరోనా వల్ల, నోట్ల రద్దు వల్ల ఒక ఏడాది ఆలస్యం గా దళితబంధును ప్రవేశపెట్టామన్నారు. హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని నూటి కి నూరుశాతం అమలు చేశామన్నారు. రాష్ట్రానికి తూర్పుభాగంలో ఉన్న సిఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క్ ప్రాతినిధ్యం వహించే చింతకాని మండలంతో పాటు మరో మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ఆ యా మండలాల్లో కూడా నూటికి నూరుశాతం అమలు చేశామని, రాజకీయాల కోసం అయితే స్వార్థంకోసం అయితే బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో అమలు చేస్తాం కాదా? ప్రతిపక్ష నేత సెగ్మెంట్లో ఎందుకు అమలు చేస్తామని ఆయన ప్రశ్నించారు. సంక్షేమ పథకాల అమలులో తాము సంకుచితంగా ఆలోచించలేదని ప్రతిపక్ష నేతల సె గ్మెంట్లో అమలు చేయడం తమ నిజాయితీకి గిట్టురాయి అని ఆయన అన్నారు.

సత్తుపల్లి సెగ్మెంట్లో దళితబంధు పథకాన్ని మొన్ననే అమ లు చేశామని అదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని వాస్తవంగా ఎన్నికల నోటిఫికేషన్ నెల గడిచిన తరువాత రావాలి కాని ముందే వచ్చిందన్నారు. దళిత బంధు, మిషన్ భగీరథ ఎన్నికల కోసం పెట్టలేదన్నారు.
సీతారామా ప్రాజెక్టు నా గుండెకాయ, నా ప్రాణం
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామా ప్రా జెక్టు నా ప్రాణం, నా గుండెకాయ అని, ఈ ప్రాజెక్టు ఇప్పటికే 70శాతం పూర్తి అయ్యిందని ఏడాదిన్నర తరువాత తానే ఇక్కడికి వచ్చి కొబ్బరి కాయ కొట్టి తానే స్వీచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేస్తానని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ఖమ్మం పాత జిల్లాకు వరప్రదాయని అవుతుందన్నారు. కల్లూరు మం డలానికి ఇంకో తడికి సాగర్ నీరు కావాలని రైతులు కోరారని ఇంకా ఎన్ని రోజులు ఈ తండ్లాటా? ఇంత కాలం సాగునీటి కోసం గోసా? కృష్ణ నదిని నమ్ముకుంటే ఎప్పటికైనా మోసమ ని గ్రహించి సీతారామా ప్రాజెక్టు ద్వారా గోదావరినీటిని కృష్ణనదికి అనుసంధానం చేస్తున్నామన్నారు. ఇప్పుడే హెలిక్యాప్టర్ ద్వారా సీతారామా ప్రాజెక్టు కాలువలను చూశానని,గోదావరి నీటిని పాలేరు రిజర్వాయర్‌కు అనుసంధానం చేస్తే నా ఖ మ్మంజిల్లా బంగారం తునక అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైన తరువాత రైతులు మూడు పంటలను సాగు చేసుకుంటూ మహారాజులుగా జీవించే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయన్నారు.

మోడీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టింది
ప్రధాని మోడీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టిందని ఇప్పటికే రైల్వే, ఎల్‌ఐసి, నౌకయానాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న మోడీ విద్యుత్‌ను ప్రైవేటీకరణ చేయాలని చూశాడని సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ప్రైవేటు రంగాల్లో ఇవ్వాలని తనపై వత్తిడి తెచ్చాడని నా ప్రా ణం పోయినా ఇవ్వనని కరాఖండిగా చెప్పడంతో తనపై వచ్చి న కోపంతో తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీ టర్లు పెట్టాలని చూశాడని, దీనికి తాను సచ్చినా పెట్టనని చెప్పాన ని దీనికి తెలంగాణ రాష్ట్రం మీద ఏటా రూ.25వేల కోట్ల జరిమానా విధించినప్పటికి జరిమానే చెల్లించానేగాని వ్యవసాయ మోటార్లకు మీటర్లను పెట్టేందుకు అంగీకరించలేదన్నారు. తా ను బతికి ఉన్నంతా కాలం మీటర్లు పెట్టనివ్వబోనని ఆయన స్పష్టం చేశారు. భారత దేశంలో 24గంటల పాటు రైతులకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ అని ఆయన అన్నారు. 24గంటల విద్యుత్‌తో రాష్ట్రంలో జనరేటర్లు, ఇన్వెర్టర్లు మాయం అయ్యాయని వైర్ వైడింగ్ షాపుల న్ని మూతపడ్డాయన్నారు. రైతులు బాగుండాలని రాష్ట్ర వ్యా ప్తంగా నీటితీరువా రద్దు చేశానన్నారు. రైతు బాగుండాలనే ఉచితంగా విద్యుత్‌తోపాటు ఎకరానికి ఏటా రూ. 10వేల పం ట సాయం చేస్తున్నామని, సంవత్సరానికి రెండు పంటలను సాగు చేసుకోవడం వల్ల ఇప్పుడు తెలంగాణ ధాన్యం దిగుబడిలో దేశంలో రెండో స్దానంలో ఉందన్నారు.

మనస్సుతో ఆలోచించి హృదయంతో ఓట్లు వేయండి
ప్రతి ఐదేళ్ళకోసారి ఎన్నికలు వస్తాయి ఎల్లయ్యో పుల్లయో మల్లయ్యో పోటీ చేస్తారు వారిలో ఎవరో ఒకరు గెలుస్తారు కాని ఇది కాదు ప్రజాస్వామ్య వ్యవస్ద ఎన్నికల్లో పార్టీలు కాదు ప్రజలు గెలువాలని సిఎం కెసిఆర్ ప్రజలకు సూచించారు. ప్ర జలంతా ఓటు వేసేముందు మనస్సు పెట్టి ఆలోచించి ఓటు వే యాలని ఆలోచన చేయకుండా ఓట్లు వేయడం వల్లనే భారత దేశానికి ఈ గతి పట్టిందన్నారు. పార్టీలను చూడకుండా వ్యక్తులను చూడాలని వారి అనుభవం, వారి కార్యదక్షత, వాళ్ళ వె నుక ఉన్నది ఏ పార్టీ, ఆ పార్టీకి ఉన్న చరిత్ర ఏంటి వారి వైఖరి ఏంటి, వారి దృక్పథం ఏంటి, ప్రజల గురించి ఆ పార్టీ ఏం ఆ లోచన చేస్తుంది అనే విషయాలను క్షుణ్ణంగా ఆలోచించాలని ఆయన విజ్ణప్తి చేశారు. మార్కెట్లో కూరగాయాలను కొనేటప్పు డు పుచ్చులు ఉన్నవాటిని ఏరివేస్తామని, చివరికి కుండా, కూ జా కొనే ముందు కూడా కొట్టి చూస్తామని అలాంటప్పుడు ఓటు హక్కును వినియోగించుకునేటుప్పుడు వెనుక ముందు ఆలోచించాలన్నారు.

ఈ బహిరంగ సభలో మంత్రి పు వ్వాడ అజయ్‌కుమార్, మంత్రి సత్మవతి రాథోడ్, లోక్‌సభలో బిఆర్‌ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, డా బండి పార్దసారధిరెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు హరిప్రియనాయక్, రాము లు నాయక్, ఆశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్సీ, బిఆర్ ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధు, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, రఘోత్తమరెడ్డి, జెడ్పీ చైర్మన్ బిందు, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, డిసిఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News