Monday, December 23, 2024

ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే.. ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది: కేసీఆర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ వస్తే.. ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని.. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్ కౌంటర్లు, నక్సలైటు ఉద్యమాలే ఉన్నాయి బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే..ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని.. ఇందిరమ్మ రాజ్యం కావాలని ఎవరు కోరుతున్నారని మండిపడ్డారు. సోమవారం స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

స్టేషన్ ఘన్ పూర్ లో 1.10లక్షల ఎకరాలకు నీళ్లు అందించామన్నారు కేసీఆర్. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకున్నామని.. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగు నీరు అందించామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కనీసం తాగునీరు కూడా సరిగా ఇవ్వలేదని విమర్శించారు.24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామని.. కాంగ్రెస్ మాత్రం మూడు గంటల కరెంటు చాలంటుందని అన్నారు. రైతులకు 10హెచ్ పీ మోటార్లు పెట్టుకోవాలని చెబుతున్నారని అన్నారు. రైతులకు 5 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు కర్నాటక కాంగ్రెస్ నేత చెబుతున్నారని.. తాము మోసపోయామని అక్కడి రైతులు తెలంగాణలో ఆందోళన చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర సంపద పెరిగిన మేరకు సంక్షేమ పథకాలు పెంచామని.. కంటి వెలుగు ద్వారా 3 కోట్ల మందికి పరీక్షలు చేయించామని తెలిపారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే.. బిఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని కేసీఆర్ ప్రజలను అభ్యర్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News