- Advertisement -
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. ప్రజల్లో రావాల్సినంత పరిణతి రాలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గురువారం వికారాబాద్ లో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్.. తెలంగాణను ఆంధ్రలో కలపడం వల్ల 60 ఏళ్లు ఎన్నో బాధలు పడ్డామని అన్నారు. ఎన్నికలు రాగానే ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు.
న్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు పార్టీ చరిత్ర కూడా చూడాలని… ప్రజల గురించి ఏ పార్టీ ఎలా ఆలోచిస్తుందో గమనించి ఓటు వేయాలని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని, ప్రజల హక్కుల సాధనకేనన్నారు. 50ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని.. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని బేరీజు వేయండని… ఆ తర్వాతనే ఓటు వేయాలని కేసీఆర్ అన్నారు.
- Advertisement -