Sunday, December 22, 2024

జీవితంలో ఒక్కసారి ఓడించబడ్డ.. ఓడిపోలేదు

- Advertisement -
- Advertisement -

తన రాజకీయ జీవితంలో ఒక్కటే ఒక్కసారి ఓడిపోయానని.. వాస్తవానికి గెలిచి ఓడిపోయాను అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.శుక్రవారం శామీర్‌పేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ గజ్వెల్ కార్యకర్తల ప్రత్యేక సమావేశానికి సిఎం కెసిఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, మాజీ స్పీకర్ మదుసూదనా చారి, బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… తన వయసు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు పోటీ చేశానని, ఆ సమయంలో బ్యాలెట్ పద్దతి ఉంటుండే… ఎలక్ట్రానిక్ మేషిన్లు లేకుండే అని అన్నారు. తనకు వచ్చిన ఓ ఐదారు వేల ఓట్లు మిగతా వారికి దాంట్లో కలిపేసి 700 ఓట్లతో తాను ఓడిపోయినట్లు డిక్లేర్ చేశారని గుర్తు చేసుకున్నారు. రీ కౌంటింగ్‌కు అవకాశం ఇవ్వలేదని, ఈ విషయంపై హైకోర్టులో కూడా కేసు వేశామని చెప్పారు. ఆ ఒక్కసారే తాను ఓడించబడ్డానని, ఎప్పుడూ ఓడిపోలేదని అన్నారు. ఆ తర్వాత తాను మళ్లీ వెనక్కి చూడలేదు..రెగ్యులర్‌గా గెలిచినానని అన్నారు. ఈ తెలంగాణ గడ్డ ఎంతో గొప్పదని పేర్కొంటూ తెలంగాణ గడ్డ గొప్పతనాన్ని కెసిఆర్ తెలియజేశారు.

తెలంగాణ వస్తది.. కెసిఆర్ మొండి తనమే తెస్తదని జయశంకర్ చెప్పారని గుర్తు చేసుకున్నారు. అనేక బాధలు పడ్డానని, పాలమూరు జిల్లాను మీ కండ్లతోటి చూడాలి… మహబూబ్‌నగర్ ఎంపిగా నిలబడాలని జయశంకర్ చెప్పారని పేర్కొన్నారు. కరీంనగర్‌లో భారీ మెజార్టీతో గెలిపించారని, మహబూబ్‌నగర్‌లో కూడా గెలిపించారని తెలిపారు. తాను మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, చరిత్రలో పాలమూరుకు కీర్తి ఉంటదని వ్యాఖ్యానించారు. మీ అందరి పుణ్యంతో గజ్వేల్ ఎంఎల్‌ఎను అయ్యాను అని గజ్వేల్ ప్రజలను ఉద్దేశించి సిఎం అన్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చాయని, తాను గజ్వేల్‌లో పోటీ చేస్తున్నానని, అందరూ కలిసి గజ్వేల్‌లో తనను గెలిపించారని సిఎం కెసిఆర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News