Thursday, January 23, 2025

నన్ను దెబ్బతీసేందుకు జగన్ కుట్ర చేశారు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సిఎం కెసిఆర్ తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. స్థానిక ఎంఎల్ఎలను మార్చబోమని, పాతవారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కెసిఆర్ మాట్లాడారు. ఎన్నికలకు పది నెలలు మాత్రమే ఉన్నాయని, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంఛార్జీని ఇస్తామన్నారు. మంత్రులు క్రియాశీలకంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ఎందుకు మాట్లాడటం లేదని ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. ఎంఎల్ఎలతో మంత్రులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. కేంద్రానికి దర్యాప్తు సంస్థలుంటే మనకు కూడా దర్యాప్తు సంస్థలున్నాయని హెచ్చరించారు.

అన్నింటికి సిద్ధంగా ఉండాలని నాయకులకు సూచించారు. ఎంఎల్సీ కవితను కూడా బిజెపిలోకి రమ్మన్నారని, తన కూతుర్ని కూడా పార్టీ మారమని అడిగారని, ఇంతకంటే ఘోరం ఉంటుందా? అని కెసిఆర్ ప్రశ్నించారు. ఇడి దాడులు చేస్తే తిరగబడాలని, ఎక్కడ కేంద్ర సంస్థలు దాడులు చేస్తే అక్కడే ధర్నాలు చేయాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి గురించి కెసిఆర్ ప్రస్తవించారు. కేంద్రానికి జగన్ అనుకూలంగా ఉన్నప్పటికీ, తనని దెబ్బ తీసేందుకు కుట్ర చేశారని మండిపడ్డారు. ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? అని అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News