Tuesday, November 5, 2024

తెలంగాణ దేశానికే ఆదర్శం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు ఆయన సందర్భంగా ఘనంగా 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా  సచివాలయంలో జాతీయ జెండాను సిఎం కెసిఆర్ ఆవిష్కరించారు. 1969లో తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైందన్నారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించే అదృష్టం తనకు దక్కిందని సంతోషంగా ఉందని కెసిఆర్ పేర్కొన్నారు.

Also Read: మా సిఎం కెసిఆర్.. మీ అభ్యర్థి ఎవరు?

కులమతాలకు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలకు అతీతంగా ఎంతో మంది ఉద్యమంలో పాల్గొన్నారని, ఎంతో మంది ఉద్యమంలో అమరులయ్యారని కెసిఆర్ గుర్తు చేశారు. తెలంగాణను పునర్ నిర్మించుకోవాలనే సంకల్పంతో ముందడుగు వేశామని తెలిపారు. తెలంగాణను చూసి దేశంలో నేర్చుకునే విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని అనాడే చెప్పామని గుర్తు చేశారు. అనతికాలంలోనే తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని, మన సాధించిన ఆశ్చర్యకర విజయాలు మన కండ్ల ముందు కనిపిస్తున్నాయని కెసిఆర్ ప్రశంసించారు. కరోనా కాలంలో కొంత కష్టపడ్డామని, ఇది నవీన తెలంగాణ నవనవోన్మేష తెలంగాణ అని అన్నారు. తలసరి ఆదాయం దేశంలోని పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు వరసలో ఉందని కొనియాడారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News