Thursday, January 23, 2025

చైనా బజార్లు పోయి భారత్ బజార్లు రావాలి: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నాందేడ్: దేశంలో చాలా వస్తువులు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. నాందేడ్‌లో జరిగిన బిఆర్‌ఎస్ సభలో కెసిఆర్ ప్రసంగించారు. మేక్ ఇన్ ఇండియా… జోక్ ఇన్ ఇండియాగా మారిందన్నారు. మాంజా నుంచి జాతీయ జెండా వరకు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నామని, దేశంలో గల్లీ గల్లీలోనూ చైనా బజార్లు ఉన్నాయని కెసిఆర్ తెలిపారు. చైనా బజార్లు పోయి భారత్ బజార్లు రావాలని పిలుపునిచ్చారు. దేశం వెనుకబాటు తనానికి కాంగ్రెస్, బిజెపిలే కారణమని కెసిఆర్ మండిపడ్డారు. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ అనేదే బిఆర్‌ఎస్ తొలి నినాదమన్నారు. అకరు అంబానీ అంటే… మరొకరు అదానీ అంటారని దుయ్యబట్టారు. తెలంగాణలో సాధ్యమైనప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కాలేదన్నారు.

దేశంలో ప్రతి ఎకరాకు నీరందించేందుకు పుష్కలమైన నీరుందన్నారు. కేంద్రం ట్రైబ్యునల్ వేసి చేతులు దులిపేసుకుంటుందన్నారు. రిజర్వాయర్లు కట్టాలంటే అనుమతుల పేరుతో కాలయాపన చేస్తుందని మోడీ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. ట్రైబ్యునల్ వివాదాలు 30, 40 ఏళ్లు కొనసాగుతున్నాయన్నారు. ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణలో కరెంటు కష్టాలు ఉండేవని, కానీ ఇప్పుడు నీటి, కరెంటు సమస్యలు లేవన్నారు. రైతులు 50 మోటార్లు పెట్టుకున్నా అడ్డు చెప్పడంలేదన్నారు. రైతులు ప్రమాదంలో చనిపోతే రైతు బీమా అందిస్తున్నామన్నారు. జెండా రంగలను చూసి జనం మోసపోతున్నారని దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్ గెలిపిస్తే రెండేళ్లలో మహారాష్ట్రలో అద్భుతాలు చేసి చూపిస్తామన్నారు. ఫసల్ బీమా యోజన అంతా ఒక బూటకమన్నారు. రైతులకు ఎక్కడ కూడా మద్దతు ధర లభించడంలేదన్నారు. తెలంగాణలో రైతులు పండించిన పంటను తెలంగాణ ప్రభుత్వమేకొంటోందన్నారు. తెలంగాణలో సాధ్యమైనప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కాదని కెసిఆర్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News