Wednesday, January 22, 2025

జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు తెలంగాణ గమ్యస్థానం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వస్తే అధకారమేనని గతంలో పాలకులు ఎద్దేవా చేశారని, విద్యుత్ అంశంలో విప్లవాత్మక విజయాలు సాధించామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. తాగునీరు అంశంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ప్రశంసించారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు ఆయన సందర్భంగా ఘనంగా 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సచివాలయంలో జాతీయ జెండాను సిఎం కెసిఆర్ ఆవిష్కరించారు. మిషన్ భగీరథకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని కొనియాడారు. నేడు తెలంగాణలో ఫ్లోరైడ్ బాధలు లేవని మోడీ ప్రభుత్వమే ఒప్పుకుందని గుర్తు చేశారు. దేశంలో అధిక వేతనాలు పొందుతున్నది మన ఉద్యోగులేనని, 20 వేల విఆర్‌ఎల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, 9355 మంది జెపిఎస్‌ల క్రమబద్ధీకరణ కొనసాగుతోందని, టిఎస్‌ఐపాస్ చట్టం ద్వారా విప్లవాత్మక మార్పులకు నాంది పలికామన్నారు.

జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు తెలంగాణ గమ్యస్థానమైందని, ఇప్పటి వరకు రూ.2.64 లక్షల పెట్టుబడులు వచ్చాయని, ఐటి రంగంలో తెలంగాణ మేటిగా నిలిచిందని ప్రశంసించారు. తెలంగాణలో ఐటి రంగం 220 శాతం వృద్ధి రేటు ఉందని, ఐటి ఉద్యోగాల నియామకాలలో 156 శాతం వృద్ధి కనిపిస్తుందని, ఐటి రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరింపజేశామని, ఖాయిలాపడిన పరిశ్రమలకు పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇస్తామని కెసిఆర్ తెలిపారు. స్టార్టప్ అవార్డుల్లో టి-హబ్ ఉత్తమ ఇంక్యెబేటర్‌గా నిలిచిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. ఎంఎన్‌సి ఉద్యోగాలు సాధించేస్థాయికి గురుకులాలు ఎదిగాయని, స్వల్ప వ్యవధిలో వైద్య, ఆరోగ్య సేవలు ప్రమాణాలు పెంచామన్నారు.

ఆరోగ్య సూచీల్లో తెలంగాణ అద్భుత పురోగతి సాధించిందన్నారు. పది లక్షల సిసి కెమెరాల ఏర్పాటు దేశంలోనే రికార్డు సృష్టించామని, తెలంగాణ జాతీయ రహదారుల నిడివి డబుల్ అయ్యిందని, రహదారుల నెట్‌వర్క్ లక్షా తొమ్మిది వేల కిలో మీటర్లకు పెరిగిందని, పాత సచివాలయంలో అనేక ఇబ్బందులు ఉండేవని, నిరంతర ప్రక్రియగా పేదలకు గృహనిర్మాణం కొనసాగిస్తామన్నారు. స్వరాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవానికి కృషి చేశామని, యాదాద్రి పునర్ నిర్మాణం అద్భుతమని కెసిఆర్ కొనియాడారు. కొండగట్టు, వేములవాడ, ధర్మపురిని అభివృద్ధి చేస్తామన్నారు. భద్రాద్రిని వైభవంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంలో ఉన్నామని కెసిఆర్ హామీ ఇచ్చారు. శబరిమలలో తెలంగాణ భక్తుల కోసం వసతి గృహం నిర్మిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News