Saturday, November 16, 2024

పోడు భూములు ఇచ్చిన తరువాత అటవీ భూములను ఆక్రమిస్తే ఊరుకోం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గిరిజనులపై దౌర్జన్యం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో పోడు భూముల చర్చ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. విచక్షణారహితంగా అడవులను నరికివేయడం సరికాదన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని, పోడు, అటవీ భూములు పలువురికి ఆటవస్తువులా తయారయ్యాయని చెప్పారు. గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడులు చేయవద్దని, అదే సమయంలో అధికారులపైనా గిరిజనుల దాడులు సహించబోమని హెచ్చరించారు. గిరిజనులకు గత పాలకులు చేసిన మోసాలు అందరికీ తెలుసునన్నారు. ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. పోడు భూములు పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు.

ఇక నుంచి పోడు భూముల రక్షిస్తామని హామీ ఇవ్వలన్నారు. పోడు భూముల పంపిణీ పూర్తి చేసిన తరువాత అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తూ ఊరుకోమని కెసిఆర్ హెచ్చరించారు. భూమి లేని గిరిజన బిడ్డలకు గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తామని కెసిఆర్ పేర్కొన్నారు. ఇక నుంచి అటవీ ప్రాంతాల్లోని ఒక చెట్టును కూడా కొట్టనివ్వమన్నారు. పర్యావరణ పరిరక్షణకు మరిన్ని చర్యలు చేపడుతామని వివరించారు. అడవుల రక్షణ అనేది మనందరి బాధ్యత అని తెలియజేశారు. కొందరు అగ్ర కులస్థులు గిరిజన యువతులను పెళ్లి చేసుకుంటున్నారని కెసిఆర్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News