Saturday, December 28, 2024

కార్మికశక్తికి అండగా కెసిఆర్

- Advertisement -
- Advertisement -

యైటింక్లయిన్‌కాలనీ : కెసిఆర్ సిఎంగా ఎన్నికైన తరువాత కార్మికశక్తికి అండగా నిలుస్తున్నారని, జాతీయ సంఘాలు పొగొట్టిన వారసత్వ ఉద్యోగాలను కెసిఆర్ తిరిగి కారుణ్య నియామకాల పేరిట ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.

ఆర్‌జి2 ఏరియా వకీల్‌పల్లి గనిలో గురువారం ఏరియా ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన దశాబ్ది ప్రగతియాత్రలో ఎమ్మెల్యే పాల్గోని ప్రసంగించారు. టిడిపి ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలు పొగొడితే, కాంగ్రెస్ లక్షా 20 వేల ఉద్యోగాలను 60 వేలకు కుదించిందని ఆరోపించారు. కెసిఆర్ వారసత్వ ఉద్యోగాలతో సింగరేణి ఉనికిని కాపాడారని కొనియాడారు. దీంతో సంస్థలో 16 వేలకు పైగా యువ ఉద్యోగులు చేరి నూతన ఉత్తేజం వచ్చిందన్నారు.

రామగుండం వాసుల చిరకాల వాంఛ అయిన మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని వేయి మందికి పైగా పరోక్షంగా ఉద్యోగాలు దక్కాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకా లు అమలు చేసిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ఐటి శాఖ మాత్యులు కెటిఆర్ రాష్ట్రంలో 15 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించార న్నారు.

సింగరేణిలోని కార్మికుల తల్లిదండ్రులకు కార్పోరేట్ వైద్యం అందించిన ఘనత టిబిజికెఎస్‌కే దక్కుతుందన్నారు. 60 సంవత్సరాల పాటు గత ప్రభుత్వాలు నిద్రపోతే గత 9 ఏళ్ల కాలంలో అనేక రకాలు అభివృద్ది చేశారన్నారు. ప్రతి ఇంటికి నేడు సంక్షేమ పథకాలు అందాయన్నారు.

ఎమ్మెల్యేగా గెలిచిన నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. సింగరేణి కార్మికుల పక్షాన కెసిఆర్ ఎల్ల ప్పుడు ఉంటారని, ఎన్నికల్లో అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్మికన్నలకు ఎలాంటి కష్టం వచ్చిన వెన్నుదన్నుగా ఉంటానన్నారు. ఎ మ్మెల్యేకు వకీల్‌పల్లి గని కార్మికులు బ్రహ్మరథం పట్టారు.

అనేక మంది టిబిజికెఎస్‌లో చేరగా కండుకాలు కప్పి స్వాగతం పలికారు. కార్యక్ర మంలో చెరుకు ప్రభాకర్‌రెడ్డి, ఐ సత్యనారాయణ, మల్లికార్జున్, బేతి చంద్రయ్య, రాములు, నాచగోని దశరథంగౌడ్, బాబురావ్, సమ్మయ్య, రాకేశ్, రాంచంద్రారెడ్డి, కార్పోరేటర్లు సాగంటి శంకర్, అడ్డాల గట్టయ్య, బారాస పట్టణాధ్యక్షులు మేడి సదయ్య, ధరణి జలపతి, జనగామ నర్సయ్య తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News