Saturday, November 23, 2024

ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందే: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

KCR strike for farmers in Delhi

ఢిల్లీ: తెలంగాణ పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని ఢ్లిలీలో దీక్ష చేస్తున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. దీక్ష ప్రాంగణం వద్ద డా బి ఆర్ అంబేడ్కర్ విగ్రహం, మహాత్మ జ్యోతి బాపూలే విగ్రహం, అమర వీరుల స్థూపానికి సిఎం కెసిఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. దీక్షకు మద్దతిచ్చేందుకు వచ్చిన రైతు సంఘం నేత టికాయత్‌కు సిఎం కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. మోడీ ప్రభుత్వంపై పోరును మరింత తీవ్రం చేసే యోచనలో ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి సుమారు రెండు వేల కిలో మీటర్ల దూరం నుంచి వచ్చి దీక్ష చేస్తున్నామని, ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు ? అని ప్రశ్నించారు.

ఎవరితోనైనా గొడవ పడొచ్చుకానీ…. రైతులతో పడవద్దని హెచ్చరించారు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరన్నారు. కేంద్ర మంత్రి తెలంగాణ రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమైనవన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలని చెప్పారని, తాము పీయూష్ గోయల్ వద్ద అడ్డుక్కోవడానికి వచ్చామా? అని, పీయూష్ గోయల్ కాదని, పీయూష్ గోల్‌మాల్ అని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా ఎక్కడా లేనంగతా 30 లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయన్నారు. మోటార్, విద్యుత్ తీగలు, బోర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో సాగు రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News