Monday, December 23, 2024

కర్నాటకలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కర్నాటక ఎన్నికల ఫలితాలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ స్పందించాడు. కర్నాటకలో బిజెపి ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదన్నారు. కర్నాటక ప్రభావం వేరే రాష్ట్రంపై ఉంటుందనుకోవడం సరికాదన్నారు. మత రాజకీయాలు చేసింది కాంగ్రెసేనని ఆరోపించారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి కెసిఆర్ మద్దతిచ్చారన్న బండి సంజయ్ ఒక్క రాష్ట్రంలో గెలవగానే కేంద్రంలో అధికారంలోకి వస్తారా? అని ప్రశ్నించారు.

తెలంగాణలో కెసిఆర్ కు బిజెపియే ప్రత్యామ్నాయం అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని బండి జోస్యం చేప్పారు. కర్నాటక కాంగ్రెస్ కు కెసిఆర్ డబ్బులు ఇచ్చారని ఆరోపించారు బండిసంజయ్. బిజెపి ఓడిపోవాలని కెసిఆర్ కోరుకుంటున్నారని ఆయన మండిపడ్దారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News