Sunday, January 19, 2025

సాయంత్రం కేసీఆర్ కు సర్జరీ

- Advertisement -
- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుక్రవారం సాయంత్రం హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ జరుగుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున కేసీఆర్ తన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కాలుజారి పడిన సంగతి తెలిసిందే. ఆయనకు సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.

శుక్రవారం ఉదయం పలువురు మాజీ మంత్రులు, కేసీఆర్ కుమార్తె కవిత ఆస్పత్రికి వచ్చి కేసీఆర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ ఆస్పత్రికి రావద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకోవడానికి ఆరునుంచి ఎనిమిది వారాలు పడుతుందని యశోదా ఆస్పత్రి డాక్టర్లు హెల్త్ బులెటిన్ లో వివరించారు.

కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News