Monday, December 23, 2024

ఫిబ్రవరి 1న ఎంఎల్ఎగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫిబ్రవరి 1న గజ్వేల్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కు కెసిఆర్ లేఖ రాశారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడగా డిసెంబర్ తొమ్మిదన అందరూ ఎంఎల్ఎలు ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 8న సిఎం కెసిఆర్ బాత్రూమ్ లో పడడంతో తుంటి ఎముక విరిగింది. ఇటీవల ఆయన కోలుకొని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 64 సీట్లు గెలవడంతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 39 సీట్లు గెలిచిన బిఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా సేవలందిస్తుంది. బిజెపి 8 సీట్లు, ఎంఐఎం ఏడు సీట్లు, సిపిఐ ఒక సీటు గెలుచుకున్నాయి. కెసిఆర్ గజ్వేల్ నుంచి మూడు సార్లు ఎంఎల్ఎగా వరసగా గెలిచారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా సేవలందించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News