Wednesday, January 22, 2025

అఖిలేశ్‌తో కెసిఆర్ చర్చలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ రాజధానిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో శుక్రవారం ఉత్తరప్రదేశ్ మాజీ ము ఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌తో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో ప్ర ధానంగా వారిద్దరూ జాతీయ రాజకీయాలు, జా తీయ సమస్యలపై చర్చించినట్లు తెలుస్తున్నది. దేశ రాజకీయాల్లో మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు, వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయం పై కూలంకషంగా చర్చించినట్లు స మాచారం. అఖిలేష్ యాదవ్ వెంట సమాజ్ వాది పార్టీ ఎంపి రాంగోపాల్ యాదవ్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News