Wednesday, January 22, 2025

గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్న కెసిఆర్ వీరాభిమాని

- Advertisement -
- Advertisement -

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామానికి చెందిన గుజ్జ నాగయ్య కుమారుడు రామకృష్ణ  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బొమ్మ తన గుండెలపై పచ్చబొట్టు వేసుకున్నాడు. ప్రత్యేక తెలంగాణ కోసం చేసిన కృషి, అభివృద్ధికి మంత్రముగ్ధుడై కెసిఆర్ 70వ పుట్టినరోజు సందర్భంగా చంద్రశేఖర్ రావు బొమ్మను గుండెలపై పచ్చబొట్టు వేయించుకొని తన అభిమానం చాటుకున్నారు. కెటిఆర్, కెసిఆర్ తో కలిసి ఫోటో దిగాలని తెలంగాణ భవనంలో ఓ సారి ప్రయత్నించిన కుదరలేదు. మొన్న జరిగిన నల్గొండ సభలో ప్రయత్నించినా కుదరలేదు. వీలైతే జీవితంలో ఒకసారైనా కెసిఆర్, కెటిఆర్ ను కలిసి వాళ్లతో ఫోటో దిగడమే తన కోరిక అన్నాడు. ఈ కార్యక్రమంలో గుజ్జ సతీష్, అనపర్తి కొండలు, గుజ్జ కొండలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News