- Advertisement -
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మంగళవారం(మార్చి 11) మధ్యాహ్నం ఒంటి గంటకు బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ మేరకు ఆదివారం బిఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు హాజరుకానున్నారు. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై సంబంధించి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలకు కెసిఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కెసిఆర్ హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
- Advertisement -