హైదరాబాద్: ప్రగతిభవన్‌లో మరికాసేపట్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, రోజూ పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు, దాని నియంత్రణపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. కరోనా కట్టడి కోసం అవసరమైతే ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించే అవకాశాలను మంత్రివర్గం పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరోనా పరిస్థితులతోపాటు 25 నుంచి 30 అంశాలపై మంత్రులతో సిఎం చర్చించనున్నట్లు సిఎం కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. వీటిలో ప్రాధాన్యత ఉన్న కొన్ని సిఎం కెసిఆర్ ఆమోదంతో ఐటమ్స్‌గా మంత్రివర్గం ముందుకు రానున్నాయని, అదేవిధంగా అన్ని అంశాలపై క్యాబినెట్ సానుకూలంగా సమాలోచనలు జరిపి సిఎం ఆమోదముద్ర వేయనున్నట్లు తెలిసింది.
KCR to Chair TS Cabinet meeting at pragathi bhavan