Wednesday, January 22, 2025

అమర దీపం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజున ఆవిష్కృతం కానున్న అద్భుత ఘట్టం
సాయంత్రం 5గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం దాకా 5వేల మంది కళాకారులతో భారీ ర్యాలీ
5.00 గం.కు ముఖ్యమంత్రి రాక, అమరవీరులకు సెల్యూట్..
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. ఆ తర్వాత అమర జ్యోతి ప్రారంభం 
శిఖరాగ్రంపై కొవ్వొత్తుల ప్రదర్శన.. చివరగా కెసిఆర్ ప్రసంగం..
 800 డ్రోన్లతో ‘జోహార్’ అనే అక్షరాలతో స్మారక చిహ్నంపై లేజర్ షో
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల ముగింపు (జూన్ 22) సందర్భంగా కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ‘తెలంగాణ అమరుల స్మారకం దీపం’ ప్రజ్వలన కార్యక్రమం బుధవారం సాయంత్రం జరగనున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్ నడిబొడ్డున యావత్ తెలంగాణ స మాజం గర్వించే మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానున్నది. రాష్ట్ర సాధన కోసం తెలంగాణ బిడ్డలు చేసిన త్యాగాల స్ఫూర్తి నిత్యం ప్రజ్వరిల్లేలా, వారి ఆశయాలు ప్రజలకు నిత్యం స్ఫురణ కు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ‘అమర దీపం’ హుస్సేన్ సాగర్ తీరాన ప్రతి రోజూ దేదీప్యమానమై వెలుగనున్నది. తె లంగాణ రాష్ట్ర సాధకులు, ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజైన జూన్ 22న ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అమరుల స్మారకం.. అమర దీపం’ వెలిగించనున్నారు. తద్వారా త్యాగధనులైన తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం నిత్య నివాళి అర్పించనున్నది.

అమరుల స్మారక భవన నిర్మాణ వివరాలు
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ఎదురుగా రూ. 177.50 కోట్లతో ఆరు అంతస్తుల్లో ప్రభుత్వం అమరవీరుల జ్యోతిని రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్ సాగర్ తీరాన లుంబినీ పార్కు సమీపంలో 3.29 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇందు కోసం కేటాయించింది. ఈ స్థలంలో 26,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రమిద ఆకారంలో అమరవీరుల స్మారక భవనాన్ని నిర్మించారు. 54, 37 అక్షాల పొడవుతో దీర్ఘవృత్తాకారంలో ప్రమిదను రూపొందించారు. దీనికి ఒక వైపు 26 మీటర్ల ఎత్తు, మరో వైపు 18 మీటర్ల ఎత్తుతో, మొత్తంగా గ్రౌండ్ లెవల్ నుండి 45 మీటర్ల ఎత్తులో దీపం ప్రకాశిస్తూ ఉంటుంది. స్మారక భవనం నిర్మాణానికి మొత్తంగా 1,600 మెట్రిక్ టన్నుల స్టెయిన్ లెస్ స్టీల్‌ను వినియోగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News