- Advertisement -
ఏప్రిల్ 27న వరంగల్ లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. పలువురు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. ఇవాళ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో నేతలతో పార్టీ రజతోత్సవ కార్యక్రమాలపై కేసీఆర్ సమావేశమై చర్చించనున్నారు. వరంగల్ మహాసభకు సంబంధించిన అంశాలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
- Advertisement -