- Advertisement -
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఈ నెల 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కెసిఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఏప్రిల్ 13న చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం
ఏప్రిల్ 15 మెదక్ లో పెద్ద ఎత్తున ఎన్నికల బహిరంగ సభలో పాల్గొనున్నారు.
కాగా, ఇటీవల జనగామ, సూర్యపేట జిల్లాలో కెసిఆర్ పర్యటించిన సంగతి తెలిసందే. పలు ప్రాంతాల్లో ఎండిన పంటలను పరిశీలించిన కెసిఆర్.. బాధిత రైతులతో మాట్లాడి బిఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. నీళ్లు లేక పంటనష్ట పోయిన రైతులకు ఒక్కొక్కరికి రూ.25వేలు ఆర్థిక సాయం అందించాలని కెసిఆర్ డిమాండ్ చేశారు
- Advertisement -