Monday, January 20, 2025

జనంలోకి కెసిఆర్!

- Advertisement -
- Advertisement -

డిసెంబర్‌లో కార్యాచరణ
ప్రకటించే అవకాశం కాంగ్రెస్
సర్కార్ ఏడాది పూర్తి
చేసుకునేంతవరకు వేచిచూసే
ధోరణి తనను కలుస్తున్న
పార్టీ నేతలకు సంకేతాలు
క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా
రేవంత్ సర్కార్ పనితీరుపై
అభిప్రాయాల సేకరణ
ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా
సమస్యలే కేంద్రంగా
ఆందోళనలు నిర్వహించాలని
శ్రేణులకు బిఆర్‌ఎస్ అధినేత
సూచన

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినే త కెసిఆర్ డిసెంబర్ నెలలో తన తదుపరి కార్యాచరణ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. కాం గ్రెస్ సర్కార్ ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత వి విధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ఆ యన భావిస్తున్నట్లు సమాచారం. తనను కలుస్తు న్న నేతలకు బిఆర్‌ఎస్ అధ్యక్షుడు ఈ మేరకు సం కేతాలు ఇస్తున్నట్లు తెలిసింది. జిల్లా కేంద్రాలు, జిల్లాల్లో పార్టీ కార్యక్రమాల్లో కొంత వేగం పెంచాలని స్థానిక సమస్యలపై సత్వరమే స్పందించాలని నేతలతో కెసిఆర్ పార్టీ నేతలతో అన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుం టే ఇంకా చాలా అంశాలపై స్పష్టత వస్తుంద ని, అ ప్పుడు సమస్యల ఆధారంగా ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందని కెసిఆర్ వారితో అన్నట్లు సమాచారం. పరిస్థితులను బట్టి కార్యాచరణ తీసుకుందామని చెప్పినట్లు తెలిసింది.

డిసెంబర్ 7వ తేదీతో రే వం త్ రెడ్డి ప్రభుత్వం కొలువుతీరి ఏడాది అవుతుంది. ఆ తర్వాత కెసిఆర్ కార్యాచరణ ప్రకటించి ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంత రం బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రజల్లోకి రాలేదు. శాసనసభ సమావేశాల సమయంలోనూ కేవలం బడ్జెట్ రోజు మా త్రమే హాజరయ్యారు. అనంతరం పార్టీ కార్యకలాపాల్లోనూ ఆయన పెద్దగా పాల్గొనలేదు. బడ్జెట్ స మావేశాల సమయంలో తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలకు దిశానిర్దేశం చేశారు.

ఆ తర్వాత ఎలాంటి సమావేశాల్లో పాల్గొనలేదు. తనను కలిసేందుకు వచ్చిన నేతలతో సమావేశమై పార్టీ గురించి, క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఆరా తీస్తూ వస్తున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పలువురు నేతలు కెసిఆర్‌ను కలిసిన సమయంలో వారితో వివిధ అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం ప్రజల కష్టసుఖాల్లో భాగం కావాలని నేతలకు సూచన తనను కలిసిన నేతలతో రుణమాఫీ, హైడ్రా కూల్చివేతలు, ప్రజల వివిధ సమస్యలు, నాయకుల ఫిరాయింపులు, తదితరాల గురించి కెసిఆర్ చర్చిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఆరా తీస్తూనే నేతలకు తగిన సూచనలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, హామీల అమలు సహా ఇతర అంశాలపై తన అభిప్రాయాలను వారికి చెబుతున్నారు. నేతలు ప్రజల్లో ఉండాలని వారి కష్టసుఖాల్లో భాగం పంచుకోవాలని సూచిస్తున్నారు.

సమస్యల ఆధారంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని వారికి చెబుతున్నట్లు తెలిసింది. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్న భావనతో కెసిఆర్ మొదటి నుంచి ఉన్నారు. ఇదే విషయాన్ని కొన్ని సందర్భాల్లో బహిరంగంగా కూడా చెప్పారు. అయితే, సర్కార్ వైఖరి కారణంగానే తాము మాట్లాడాల్సి వస్తోందని కూడా అప్పట్లో అన్నారు. ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై నేతలు బాగానే స్పందిస్తున్నారని కొనసాగించాలని నేతలతో గులాబీ అధినేత అంటున్నారని సమాచారం. దూకుడుగా వెళ్లాల్సిన అవసరం లేదని ప్రజా సమస్యల ఆధారంగా ముందుకెళ్లాలని సూచించినట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News